E-PAPER

చిన్న గురుదాసుపురం కూడలి వద్ద మద్యం దుకాణం వద్దు 200 మందితో భారీ సభ.. ఏకగ్రీవంగా తీర్మానం

శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్ తెలుగు

చిన్న గురుదాసుపురం కూడలి వద్ద మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని స్థానిక గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ మేరకు చిన్న గురుదాసుపురం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో సుమారు 200 మంది పాల్గొని, మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

చిన్న గురుదాసుపురం, కొబ్బరి చెట్లూరు, చిన్న మామిడిమెట్టు, రంగోయి, గురుదాసుపురం, నీలావతి, మాకన్నపల్లి, గొల్ల మాకనపల్లి తదితర గ్రామాల ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బొడ్డపాడు, మాకనపల్లి, నీలావతి, గురుదాసుపురం, రంగోయి పంచాయతీలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

యువత భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమమే ముఖ్యం

గురుదాసుపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కే. రూపవతి, లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. చిన్న గురుదాసుపురం కూడలి వద్ద మద్యం దుకాణం ఏర్పాటును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమం, గ్రామీణ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దుకాణం ఏర్పాటును నిలిపివేయాలని కోరారు.

ఉద్దానం ప్రాంతంలో మద్యం దుకాణాలకు తావు ఉండకూడదని, మద్యపానాన్ని ప్రోత్సహించే చర్యలకు మద్దతు ఇవ్వకూడదని సభలో తీర్మానించారు. అంతేకాకుండా మద్యం దుకాణం ఏర్పాటు కోసం ఎవరూ స్థలాన్ని లేదా దుకాణాన్ని అద్దెకు ఇవ్వకూడదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఇతర గ్రామాల నుంచీ మద్దతు

మూడు గ్రామాల ప్రజలు ప్రారంభించిన ఈ ఉద్యమానికి ఉద్దానం ప్రాంతంలోని ఇతర పంచాయతీల ప్రజలు కూడా మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల అభిప్రాయాలను, గ్రామాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులు మద్యం దుకాణం ఏర్పాటును నిలిపివేయాలని సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.

“మా గ్రామాల కూడలిలో మద్యం దుకాణం వద్దు.. మా ప్రాంత ప్రజల ఆరోగ్యం, కుటుంబాల భవిష్యత్తే ముఖ్యం” అనే నినాదంతో ప్రజలు తమ ఐక్యతను చాటుకున్నారు.

సమావేశంలో పాల్గొన్నవారు

చిన్న గురుదాసుపురం గ్రామ పెద్దలు జనగ ఢిల్లీరావు, జనగ ధర్మారావు, మద్దిల వినోద్, జనగ తిరుపతిరావు, కొండె మోహనరావు, సాలిన రమేష్, పోతనపల్లి సీతారాజు, పాలిన కృష్ణారావు, జనగ తాతారావు, జనగ సీతారాం, యువజన సంఘం సభ్యులు దేవదాసు, శ్రీధర్, సీతారాం, క్రాంతి, దిలీప్ కుమార్, కొండె ప్రభాకర్, డొక్కరి మధు, పాలిన కుర్మారావు, చందుతో పాటు ఇతర గ్రామాల పెద్దలు సాలిన వీరస్వామి, రాపాక చిన్నారావు, సైని దేసయ్య, దాసరి ధనేష్, సాలిన కోదండరావు, కుత్తుం ధర్మారావు, జానకిరామ్, సోర్ర సింహాచలం, బచ్చల శ్రీనివాస్, పాతిన జానకిరావు, కోరాడ లింగయ్య, సర్పంచ్ సూర్యనారాయణ, దున్న దిల్లేష్, మడియా వాసు, సింహాచలం, మండల తులసిరావు, గార సత్యం తదితరులు పాల్గొన్నారు.

Y7 NEWS TELUGU – ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!