పత్తికొండ, అక్టోబర్ 11 (Y7 న్యూస్ తెలుగు):
పత్తికొండ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి ఫుట్‌బాల్ జట్టుకు కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది.
ఈ కోచింగ్ క్యాంప్‌ను బత్తిన లోకనాథ్, ప్రకాష్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల కార్యదర్శి చందు నాయక్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు పాండురంగరాజు ప్రారంభించారు.
ఈ శిక్షణ శిబిరంలో క్రీడాకారులకు రంగస్వామి, రాము కరణం కోచింగ్ అందిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు మధు, హరి, ఆర్ఎంఎస్ మేనేజర్ రమేష్, వార్డెన్ నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బత్తిన లోకనాథ్ మాట్లాడుతూ, కోచింగ్ క్యాంప్‌లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొంది జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
Y7 NEWS TELUGU – ప్రజల గొంతుక









