నాలుగో రోజు మౌన పోరాట దీక్ష:
చింతూరు,(వై7 న్యూస్ ), అక్టోబర్ 09: ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ వైద్య ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు నిరసనలో భాగంగా నాలుగో రోజు మౌన దీక్ష చేపట్టడం జరిగింది. గత నెల రోజులుగా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఐదు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమైనందున, ముక్తకంఠంతో విధులు బహిష్కరించి మా న్యాయమైన డిమాండ్లను మీడియా మరియు ప్రజల ముందు ఉంచడం జరిగింది.
ఉద్యోగాల రెగ్యులరైజేషన్, ఒకవేళ రెగ్యులర్ కానిపక్షంలో అప్పటివరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి.
విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.
ప్రస్తుతం మా ఉద్యమం శాంతియుతంగా సాగుతోంది. ప్రభుత్వం మా న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాము. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మేము సేవలు అందించాము. ఆ సమయంలో ఎంతోమంది తోటి సిబ్బంది ప్రాణాలు కోల్పోయినా, వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక భరోసా గానీ, న్యాయం గానీ దక్కలేదు.
శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సలహాదారులు మాడివి నెహ్రూ, లాయర్స్ అసోసియేషన్ బార్ కమిటీ సభ్యులు మాడివి రవితేజ, ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్,కాక సీతరామయ్య, మీడియం రమణమ్మ, ముచ్చిక నాగార్జున, తుర్రం చంటి, సోడి ప్రసాద్, మాదాల చంటి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
చింతూరు డివిజన్ ఏహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









