బయ్యారం, అక్టోబర్ 8 (వై7 న్యూస్):
క్లిష్టమైన, సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కోసం అంకితభావంతో సేవలందించిన బయ్యారం సీఐ వెంకటేశ్వర్లుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అందించే కఠిన సేవా పథకం లభించింది.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా సీఐ వెంకటేశ్వర్లు ఈ పథకాన్ని అందుకున్నారు.
విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు ఈ గుర్తింపు దక్కిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సహచర పోలీసు అధికారులు, సిబ్బంది సీఐ వెంకటేశ్వర్లును అభినందించారు.
Y7 NEWS TELUGU
ప్రజల గొంతుక
Post Views: 211









