E-PAPER

హరిపురం అభివృద్ధికి శ్రీకారం.. రూ.3.25 కోట్ల పనులకు శంకుస్థాపన..!

మందస, అక్టోబర్ 8 (Y7 News Telugu): పలాస నియోజకవర్గంలోని మందస మండలం హరిపురం ప్రాంత అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. హరిపురం రోడ్డులో రూ.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న సెంటర్ డివైడర్, లైటింగ్ పనులకు, అలాగే రూ.2.50 కోట్లతో నిర్మించనున్న ఆధునిక స్టేడియానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాగా, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.

హరిపురం రోడ్డులో చేపట్టనున్న సెంటర్ డివైడర్, లైటింగ్ పనుల ద్వారా రహదారి సుందరీకరణతో పాటు రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారులకు మెరుగైన భద్రత, సౌకర్యాలు కలగనున్నాయి. డివైడర్ ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడా అవకాశం ఏర్పడనుంది.

అదేవిధంగా హరిపురం గ్రామంలో రూ.2.50 కోట్లతో నిర్మించనున్న ఆధునిక స్టేడియం గ్రామీణ యువతకు క్రీడా అవకాశాలను మరింత విస్తరించనుంది. స్థానిక యువత, విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు, వివిధ క్రీడల్లో శిక్షణ పొందేందుకు ఈ స్టేడియం ఉపయోగపడనుంది. భవిష్యత్తులో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే కేంద్రంగా ఇది నిలవనుందని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానికులు, యువత ప్రతినిధులు మాట్లాడుతూ రహదారి అభివృద్ధి పనులు, స్టేడియం నిర్మాణం హరిపురం ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని హర్షం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!