E-PAPER

యగ్గడిగూడెంలో సింగరేణి ఉచిత వైద్య శిబిరం

మణుగూరు, అక్టోబర్ 8 (Y7 News Telugu): సింగరేణి సేవ సమితి, సింగరేణి వైద్య & ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మణుగూరు ఉపరితల గని ప్రాజెక్టు ప్రభావిత పునరావాస గ్రామమైన యగ్గడిగూడెంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

సింగరేణి సంస్థ తమ సామాజిక బాధ్యతలో భాగంగా గనుల ప్రాజెక్టుల ప్రభావిత గ్రామాలు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. శిబిరంలో మహిళలు, పురుషులు, వృద్ధులు కలిపి మొత్తం 81 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

సింగరేణి ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డా. జి. మణి గ్రామస్తులను పరీక్షించి సాధారణ వ్యాధులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అలాగే బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి నియంత్రణ మందులు పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏజీఎం (పర్సనల్) & అధికార ప్రతినిధి ఎస్. రమేష్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభావిత గ్రామాల్లో ఇటువంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రూప శ్రీ, ఆసుపత్రి సిబ్బంది నాగమణి, గ్రామ పెద్ద కృష్ణార్జున్, యువకులు సంపత్, సందీప్, సేవ కో-ఆర్డినేటర్ కె. వెంకట మారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Y7 NEWS – ప్రజల గొంతుక.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!