సూర్య వరుస విజయాలతో మంచి జోరు మీదున్నాడు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య.. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్‌పై కన్నేశాడు. ‘కంగువా’, ‘రెట్రో’ చిత్రాల తర్వాత ప్రయోగాలకు దూరంగా ఉంటూ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తుండటంతో ఈ ఫార్ములా వర్కౌట్ అవుతోంది.
తాజాగా సూర్య 47వ చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సూర్య ఇందులో విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయాల తర్వాత ‘సీన్’ కూడా హిట్ అయితే సూర్య హ్యాట్రిక్ పూర్తి చేసినట్లవుతుంది. ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకుంటే కోలీవుడ్‌లో సూర్యకు ప్రత్యేక రికార్డు దక్కే అవకాశం ఉంది. అలాగే తమిళ, తెలుగు, మలయాళ దర్శకులతో వరుస విజయాలు అందుకున్న హీరోగా నిలిచే ఛాన్స్ కూడా ఉంది. సూర్య ఈ రికార్డులను సాధిస్తాడా లేదా అనేది ‘సీన్’ విడుదల తర్వాత తేలనుంది.









