చింతూరు, (వై7 న్యూస్ తెలుగు) సెప్టెంబర్ 11:
ఇటీవల దేశ వ్యాప్తంగా విడుదల అయిన నీట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ ఉచిత సీటు కైవసం చేసుకున్న గిరిజన విద్యార్థిని కాక వర్షిణి ప్రియను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొక్వాల్ ఘనంగా సన్మానించారు. ఆమె ప్రతిభను అభినందిస్తూ ఆయన వర్షిణికి ‘సేవా సమన్ పురస్కారం’ అందజేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ఎటపాక మండలం, కృష్ణవరం గ్రామానికి చెందిన కాక వర్షిణి ప్రియ ఈ అరుదైన ఘనత సాధించింది తల్లితండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులగా పనిచేస్తున్నారు. నీట్లో సాధించిన ఉత్తమ ర్యాంక్ ద్వారా ఆమె గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఉచిత సీటు దక్కించుకుంది. ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్తో పాటు ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా వర్షిణిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. మారుమూల గిరిజన ప్రాంతం నుండి కష్టపడి చదివి మెడికల్ సీటు సాధించిన వర్షిణి ప్రియ ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో సుజాత పాల్గొన్నారు.








