శ్రీకాకుళం జిల్లా, పలాస | వై7 న్యూస్
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ప్రస్తుత 10వ వార్డు కాశీగుండం ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది అని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్థానికులు పేర్కొన్నారు. కాశీగుండం ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టిన మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచగలమని సూచించారు.
Post Views: 17









