శ్రీకాకుళం జిల్లా, పలాస — సెప్టెంబర్ 10 (వై7 న్యూస్):
పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 67 పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు విడుదల చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు మొత్తం 67 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రకటించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 19









