
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసి పిల్లల విద్యాభివృద్దే సమరిటన్స్ ఫర్ ది నేషన్ సంస్థ లక్ష్యం
చింతూరు (వై7 న్యూస్), ఆగస్టు 22 : పోలవరం జిల్లా చింతూరు మండలంలోని గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో సమరిటన్స్ ఫర్ ది నేషన్ ఆధ్వర్యంలో లచ్చిగూడెం ఎంపీపీ ఎస్ పాఠశాలను రూ.2 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో రెండు మరుగుదొడ్లు, విద్యుత్ పనులు, తరగతి గదుల మరమ్మతులు, పెయింటింగ్, ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కీర్తి, గ్రామస్థులు మరియు సమరిటన్స్ ఫర్ ది నేషన్ వ్యవస్థాపకులు పి. రామ్ కుమార్ , టీం సభ్యులు దామోదర్ , చంద్రయ్యలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ, “పిల్లల భవిష్యత్తుకు మంచి విద్యా వాతావరణం బలమైన పునాది. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మా సంస్థ నిరంతరం కృషి చేస్తుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.








