E-PAPER

OnePlus 4G Phone: 5G కాలంలో 4G ఫోన్‌.. భారత్‌లో సెప్టెంబర్‌లో లాంచ్!

5G స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ కొత్త 4G ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ డివైస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సెప్టెంబర్‌లో ఈ సరికొత్త 4G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం, వన్‌ప్లస్ సెప్టెంబర్‌లో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఈ 4G హ్యాండ్‌సెట్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం 5G ఫోన్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులను ఆకర్షించడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే ఈ ఫోన్ పేరు, ధర, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే వంటి పూర్తి స్పెసిఫికేషన్లపై ప్రస్తుతం స్పష్టమైన సమాచారం లేదు. ఈ డివైస్‌ కేవలం భారత మార్కెట్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!