E-PAPER

ఇమ్రాన్‌ ఖాన్‌కు అస్వస్థత.. భారీ భద్రత మధ్య ఆస్పత్రికి తరలింపు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం భారీ భద్రత మధ్య ఆస్పత్రికి తరలించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో పాటు కంటి చూపు మందగించడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. జైలులో అందుతున్న వైద్య సేవలపై కూడా పలు సందేహాలు వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!