E-PAPER

Redmi Watch 6 Active: 18 రోజుల బ్యాటరీతో కొత్త స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్లు ఇవే!

షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ చైనాలో తన కొత్త స్మార్ట్‌వాచ్‌ Redmi Watch 6 Activeను విడుదల చేసింది. 1.85 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చిన ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, 140కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వినియోగంతో పాటు ఫిట్‌నెస్, స్పోర్ట్స్ ట్రాకింగ్‌కు అనుగుణంగా దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

Redmi Watch 6 Activeలో 470mAh బ్యాటరీని అందించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 18 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో తరచూ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎక్కువకాలం వాచ్‌ను ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ద్వారా వాచ్‌ నుంచే కాల్స్‌ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.

ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ కోసం 140కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. వర్కౌట్స్, నడక, రన్నింగ్ వంటి వివిధ కార్యకలాపాలను ట్రాక్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్‌ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఇతర దేశాల్లో, ముఖ్యంగా భారత్‌లో, దీని విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయంపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!