ఆధునిక జీవనశైలి కారణంగా వెన్నెముక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఈ రోజును ప్రత్యేకంగా పాటిస్తారు. అయితే, మారుతున్న కాలంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యలూ పుట్టుకొస్తున్నాయి. అందులో ముఖ్యమైనదే ‘టెక్స్ట్ నెక్ సిండ్రోమ్’. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల వంటి డిజిటల్ స్క్రీన్లను గంటల తరబడి చూడటం వల్ల ఈ సమస్య తీవ్రంగా విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకింత ప్రమాదకరం?
సాధారణంగా నిటారుగా ఉన్నప్పుడు మన తల బరువు సుమారు 4.5 నుంచి 5 కిలోల వరకు ఉంటుంది. కానీ, మనం స్మార్ట్ఫోన్ చూడటానికి తలను ముందుకు వంచినప్పుడు, మెడలోని వెన్నుపూసలపై (సెర్వికల్ స్పైన్) పడే ఒత్తిడి ఏకంగా 22 కిలోల బరువుకు సమానంగా పెరుగుతుంది. ఈ అదనపు భారం మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది చాలా కాలం కొనసాగితే మెడలోని సహజమైన వంపు దెబ్బతినడం, వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్లు అరిగిపోవడం, నరాలు నొక్కుకుపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
ప్రధాన లక్షణాలు ఇవే..
ప్రారంభంలో మెడనొప్పి, మెడ కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది దీనిని సాధారణ నొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, సమస్య ముదిరితే భుజాలు, చేతులు, వేళ్లలోకి తిమ్మిర్లు పాకడం, తల వెనుక భాగంలో తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, మెడను స్వేచ్ఛగా కదిలించలేకపోవడం, భుజాలు త్వరగా అలసిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
నివారణ మార్గాలు
ఒకవేళ మెడనొప్పి దీర్ఘకాలంగా వేధిస్తున్నా, తిమ్మిర్లు చేతులకు పాకుతున్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. తొలిదశలోనే సరైన చికిత్స తీసుకుంటే వెన్నెముక ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Post Views: 2