E-PAPER

అనిరుధ్-కావ్య మారన్ మొదలైన పెళ్లి సందడి..!

గత కొంతకాలంగా దక్షిణాది సినీ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా నలుగుతున్న వార్తకు బలం చేకూరింది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ వార్తలపై ఇప్పటివరకు ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ, పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

అనిరుధ్, కావ్య మారన్‌ల వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. నవంబర్ 21వ తేదీన చెన్నైలో జరగనున్న తమ కుమార్తె కావ్య మారన్-అనిరుధ్ రవిచందర్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా వారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఈ ఆహ్వానంతో రిసెప్షన్ తేదీపై స్పష్టత వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత స్టాలిన్ వంటి ప్రముఖులకు కూడా కళానిధి మారన్ స్వయంగా ఆహ్వాన పత్రికలు అందించనున్నారని సమాచారం. ఈ పరిణామంతో, త్వరలోనే మారన్ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!