కరకగూడెం, ఆగస్టు 19: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో కరకగూడెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రేగా అభిమానులు సంబరాలు నిర్వహించారు. న్యాయవ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకం నిజమైందని, ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ రేగా కాంతారావును ముందుకు నడిపిస్తుందని వారు పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, రేగా కాంతారావుపై చేసిన ఆరోపణలు నిరాధారమని న్యాయస్థానం తీర్పుతో స్పష్టమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు కొమరం రాంబాబు, ఊకే రామానాథం, రేగా సత్యనారాయణ, వెంకటరెడ్డి, సోందు పాషా, కొమరం సత్యనారాయణ, ఎల్లు రామకృష్ణారెడ్డి, కనకయ్య, నర్సయ్య, లెనిన్, శ్రీను, సతీష్, యాకుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, రేగా అభిమానులు హాజరై సంబరాల్లో పాల్గొన్నారు.
– రిపోర్టర్ దిలీప్ కుమార్
Post Views: 32









