పలాస, ఆగస్టు 19 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా పలాసలోని SBSYM డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు కైవసం చేసుకున్నారు.
ఈ నెలలో నిర్వహించిన కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీల్లో కళాశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో రాణించారు. 200 మీటర్ల విభాగంలో ఎం. నీతు, పీ. మానస ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా, 1500 మీటర్ల విభాగంలో ఎం. హేమలత, ఎం. పవిత్ర, జె. కిరోణి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు.
అలాగే 5 కిలోమీటర్ల పరుగు పోటీలో బి. పూజిత ప్రథమ స్థానం సాధించగా, లాంగ్ జంప్‌లో ఎం. నీతు తృతీయ స్థానం, షాట్‌పుట్‌లో సీకే. హరిత ద్వితీయ స్థానం సాధించారు. 1500 మీటర్ల బాలుర విభాగంలో పీ. జస్వంత్, లాంగ్ జంప్ బాలుర విభాగంలో ఎస్. నితిన్ చక్రవర్తి తృతీయ స్థానాలు పొందారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో 400 మీటర్ల రిలే విభాగంలో ఎం. హేమలత తృతీయ స్థానం, హ్యామర్ త్రో విభాగంలో సీకే. హరిత ద్వితీయ స్థానం సాధించి కళాశాలకు గౌరవం తీసుకొచ్చారు.
విద్యార్థుల విజయాలపై కళాశాల ప్రిన్సిపాల్ టి. ప్రమీల కుమారి హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ మాస్టర్ వి. రాజుతో పాటు అధ్యాపకులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.









