E-PAPER

పలాస-కాశీబుగ్గలో ఆధునిక ఎల్‌ఈడీ వీధి దీపాలు.. ఈఈఎస్‌ఎల్‌తో మున్సిపాలిటీ ఒప్పందం

పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆధునిక ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) సంస్థతో మున్సిపాలిటీ ఒప్పందం కుదుర్చుకుంది.

విశాఖపట్నంలోని VMRDA కార్యాలయంలో RDMA వి. రవీంద్ర సమక్షంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, EESL ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ శ్రీకర్ కూడా పాల్గొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా పలాస-కాశీబుగ్గ పట్టణ పరిధిలో ఆధునిక ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణ చేపట్టనున్నారు. దీంతో విద్యుత్ వినియోగం తగ్గి మున్సిపాలిటీకి విద్యుత్ ఆదా కలగడంతో పాటు పట్టణ ప్రజలకు మెరుగైన వీధి వెలుగులు అందుబాటులోకి రానున్నాయి.

వీధి దీపాల నిర్వహణలోనూ మెరుగైన సేవలు అందే అవకాశం ఉండటంతో పట్టణ ప్రజలకు ఈ చర్య ప్రయోజనకరంగా ఉంటుందని మున్సిపల్ అధికారులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!