చింతూరు: చింతూరు మండలంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 2026–27 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ ద్వారా భర్తీ చేయనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ మేరకు కమిషనర్ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులను చింతూరు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఖాళీల వివరాలు
చింతూరు మండలంలో మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) – 1, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) – 15 పోస్టులు ఉన్నాయి.
ఎస్జీటీ పోస్టులు:
– ఎంపీపీఎస్ నర్సింగపేట – 1
– ఎంపీపీఎస్ దొంగల జగ్గారం – 1
– ఎంపీపీఎస్ అల్లిగూడెం – 1
– ఎంపీపీఎస్ లంకపల్లి – 1
– ఎంపీపీఎస్ సురకుంట – 1
– ఎంపీపీఎస్ గంగానమెట్ట – 1
– ఎంపీపీఎస్ లచ్చిగూడెం – 1
– ఎంపీపీఎస్ వంకగూడెం – 1
– ఎంపీపీఎస్ జువ్విగూడెం – 1
– ఎంపీపీఎస్ కొత్తపల్లి – 1
– ఎంపీపీఎస్ నేలకోట – 1
– ఎంపీపీఎస్ సుకుమామిడి – 1
– ఎంపీపీఎస్ పొల్లూరు – 1
– ఎంపీపీఎస్ పావురులంక – 1
– ఎంపీపీఎస్ ఉలుమూరు – 1
స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్):
– జడ్పీహెచ్‌ఎస్ చింతూరు – 1
ఖాళీగా ఉన్న పోస్టులను పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్స్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఎంఈఓ వెంకటేశ్వర్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.









