‘కరుప్పు’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సూర్య.. కొద్ది నెలల గ్యాప్‌లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తో ప్రేక్షకులను పలకరించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.
సినిమా ప్రారంభమైన తర్వాత దాదాపు 20 నిమిషాలు కాస్త స్లో నరేషన్‌తో సాగుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే కథలోకి వెళ్లిన తర్వాత సినిమా ఆసక్తికరంగా మారి ఇంటర్వెల్ వరకు మంచి ఫీల్‌ను అందిస్తుందని తెలుస్తోంది. ప్రథమార్థం కథాంశం చుట్టూనే సాగుతూ కామెడీ, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఫస్ట్ హాఫ్ మొత్తంగా మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుందని టాక్.
ఇక సెకండాఫ్ కూడా డీసెంట్‌గా, నీట్‌గా సాగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు మంచి ముగింపును అందించిందని ప్రేక్షకుల అభిప్రాయం. అయితే కొన్ని అనవసరమైన సబ్‌ప్లాట్స్, మెలోడ్రామా ఎక్కువైనట్లు అనిపిస్తుందని, అక్కడక్కడా సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నారు. రన్‌టైమ్‌ను మరింత తగ్గించి ఉంటే సినిమా ఇంకా బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.








