E-PAPER

మరికొన్ని రోజుల్లోనే ‘Motorola Signature 27’ ఎంట్రీ..!

మోటరోలా అభిమానులకు గుడ్ న్యూస్. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026’లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన తర్వాత, కంపెనీ ఇప్పుడు దాని ఇండియా లాంఛ్​ను కన్ఫర్మ్ చేసింది. Motorola India అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. అందులో “Stay Tuned, Coming This November” అనే మెసేజ్ ఉంది. దీన్నిబట్టి, ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెల అంటే నవంబర్ 2026లో భారతదేశంలో లాంఛ్ అవుతుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్​కు సంబంధించిన ఎటువంటి మైక్రోసైట్ Flipkart లేదా Amazonలో అందుబాటులోకి రాలేదు. అయితే మోటరోలా గత ట్రాక్ రికార్డ్​ను పరిశీలిస్తే, కంపెనీ తన స్మార్ట్‌ఫోన్‌లను చాలా వరకు Flipkartలో విక్రయిస్తుంది, కాబట్టి అక్కడ కూడా త్వరలోనే మైక్రోసైట్ ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది.

ధర ఎంత ఉండొచ్చు?: ధర విషయానికొస్తే, ప్రముఖ టిప్‌స్టర్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్రాకిన్ టెక్‌ను ఉటంకిస్తూ.. మోటరోలా సిగ్నేచర్ 27 ప్రారంభ ధర భారతదేశంలో రూ. 70,000 నుంచి రూ. 80,000 మధ్య ఉండొచ్చని పేర్కొన్నారు. మునుపటి మోటరోలా సిగ్నేచర్ మోడల్​ను రూ. 59,999 ధరతో ప్రారంభించారు కాబట్టి, ఈ కొత్త అప్‌గ్రేడ్ మోడల్ ధర కాస్త ఎక్కువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.

క్వాల్‌కామ్ పవర్​ఫుల్ ప్రాసెసర్: ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 2026లో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో గ్లోబల్‌గా ప్రకటించారు, దీంతో దీని ఫీచర్లు ఇప్పటికే రివీల్ అయ్యాయి. ఇందులో క్వాల్‌కామ్ అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 చిప్‌సెట్​ను అందిస్తున్నారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఫోన్ వేడెక్కకుండా నిరోధించడానికి మోటరోలా అడ్వాన్స్‌డ్ ‘ఆర్కిటిక్‌మెష్’ కూలింగ్ సిస్టమ్‌ను పొందుపరిచింది. ఇందులో మునుపటి మోడల్ కంటే 40% పెద్ద 3D వేపర్ ఛాంబర్​తో పాటు డైమండ్-ఇన్‌ఫ్యూజ్డ్ థర్మల్ జెల్, లిక్విడ్ మెటల్, కాపర్ మెష్ లేయర్లు ఉన్నాయి. ఇవి ఎక్కువసేపు వాడినా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు సహాయపడతాయి.

కెమెరా సెటప్: ఫొటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పొచ్చు. దీని వెనుక ప్యానెల్‌లో అధునాతన కెమెరా సెటప్​ను అందిస్తున్నారు. ఇందులో 50MP సోనీ LYTIA 910 మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఇదే సెన్సార్‌ను మునుపటి మోడల్‌లో కూడా ఉపయోగించారు. అయితే ఇందులో మెయిన్ హైలైట్ 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా. AI సపోర్ట్‌తో ఈ కెమెరా 100x ‘సూపర్ జూమ్ ప్రో’కు సపోర్ట్ చేస్తుందని, దీంతో దూరంగా ఉన్న వస్తువులను కూడా అత్యంత స్పష్టంగా, వివరంగా చిత్రీకరించవచ్చని మోటరోలా చెబుతోంది.

పాంటోన్ రంగులలో ప్రీమియం డిజైన్ & లుక్: ఈ ఫోన్ డిజైన్ అత్యంత ప్రీమియం, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దృఢమైన అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. దీని కెమెరా మాడ్యూల్ సిరామిక్, బ్రష్డ్ అల్యూమినియం కాంబినేషన్‌తో రూపొందించారు. ఈ ఫోన్ రెండు ప్రత్యేక పాంటోన్ కలర్స్‌లో లభిస్తుంది. మొదటిది ‘పాంటోన్ కోల్ స్మోక్’, ఇది ‘టాక్టికల్ వీవ్’ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇక రెండో కలర్ ఆప్షన్ ‘పాంటోన్ క్యాపులెట్ ఆలివ్’. ఇది బ్రష్డ్ టెక్స్‌టైల్-ఇన్‌స్పైర్డ్ బ్యాక్‌తో వస్తుంది. మోటరోలా త్వరలో అధికారిక లాంచ్ డేట్‌ను ప్రకటించనుంది, మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!