E-PAPER

భారతీయ పైలట్‌కు యూఏఈ అత్యున్నత అవార్డుతో సత్కారం..!

భారత పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌కు అంతర్జాతీయ గౌరవం! విమానంలో జరిగిన దాడిని ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సాహసానికి యూఏఈ ప్రభుత్వం అరుదైన పురస్కారంతో సత్కరించింది! హైజాక్‌ యత్నాన్ని అడ్డుకొని 174 మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన బ్రేవ్‌ హర్ట్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌కు ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌ II’ ఫస్ట్‌ క్లాస్‌ అవార్డుతో సత్కరించింది UAE. మచ్చర్‌ తో పాటు ఆ రోజు ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఫైట్‌ సిబ్బందిని, ప్రయాణికులనూ సన్మానించింది.దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ అవార్డును ప్రదానం చేశారు. మచ్చర్‌ అండ్‌ టీమ్‌ను అభినందించారు.

మచ్చర్‌ ది రియల్‌ హీరో.. అంటూ ట్రంప్‌ సహా దేశాధినేతలు కితాబునిచ్చారు. ఇజ్రాయిల్‌ ఇండిపెండెన్స్‌కు విశిష్ట అతిథులుగా రావాలంటూ ప్రధాని మోదీతో పాటు మచ్చర్‌ను ఆహ్వానించారు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతాన్యాహు. ప్రెసిడెన్షియల్‌ అవార్డ్‌ ఫర్‌ సివిలియన్‌ హీరోయిజం.. తమ దేశ అత్యున్నత అవార్డును మచ్చర్‌కు ఇస్తామని అనౌన్స్‌ చేశానే ఇజ్రాయిల్‌ ఐజాక్‌ హెర్జాగ్‌ ఒళ్లంతా నెత్తురోడుతున్నా సరే.. కళ్లు మూతలు పడుతున్నా లెక్క చేయకుండా 174 మంది ప్రాణాలు కాపాడిన బ్రేవ్‌ హార్ట్‌..కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌. ఆకాశ వీధిలో అనూహ్య ప్రమాదం..అంజన్నను స్మరిస్తూ కో-పైలట్‌ కుట్రను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ప్రధాని మోదీతో మాట్లాడుతో హనుమాన్‌ చాలీసా పఠనమే తనకు శక్తినిచ్చిందన్నారు మచ్చర్‌. అప్పటి నుంచి విదేశాల్లో హనుమాన్‌ చాలీసా వైరలవుతోంది.

సెప్టెంబర్‌ 30 ఫ్లై దుబాయి విమానం కాక్‌పిట్‌లో మచ్చర్‌ పై కో-పైలట్‌ దాడి చేశాడు. విమానాన్ని హైజాక్‌ చేయడమో.. 9/11 తరహాలో టెల్‌ అవీవ్‌ బిల్డింగ్‌లను ధ్వంసం చేయడమో కో-పైలట్‌ కుట్ర . ఆ మ్యాటర్‌పై ఇంకా ఎంక్వయిరీ జరుగుతోంది. కానీ ఆరోజు జరిగిన ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి 174 మంది ప్రయాణీకులను కాపాడిన మచ్చర్‌..ది రియల్‌ హీరో అంటూ యావత్‌ దునియా ఆయనకు సెల్యూట్‌ చేసింది. ఆయన ధైర్యసాహసాలకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు క్యూ కడుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!