
పినపాక, ఆగస్టు 14 (వై7 న్యూస్): అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పినపాక మండలంలోని బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని విప్పలగుంపు మరియు చింతలపాడు ఆదివాసి గ్రామాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 63 మంది ఆదివాసి చిన్నారులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఆదివాసి గ్రామాల్లోని చిన్నారులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు కట్ల నరేష్, కే. నాగేశ్వరరావు, ఆకుల వెంకటేష్, సైదా నాయుడు, చంద్రశేఖర్, శ్రీనివాస రెడ్డి, గణేష్, బోటిగూడెం మాజీ సర్పంచ్ సుధాకర్, ఈశ్వరయ్య, విప్పలగుంపు గ్రామ పెద్దలు నరసయ్య, మడకం రమేష్, చింతలపాడు గ్రామ పెద్దలు మడవి జోగయ్య, నూప దేవయ్య తదితరులు పాల్గొన్నారు.









