వివో తన ఫ్లాగ్షిప్ X300 FE స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇప్పటివరకు 12GB RAMతో 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. తాజాగా 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.84,999గా నిర్ణయించారు. దీంతో X300 FE సిరీస్‌లో ఇదే ఎంట్రీ-లెవల్ మోడల్‌గా నిలిచింది.
మరోవైపు 12GB RAM వేరియంట్ల ధరలను కూడా కంపెనీ ఇటీవల పెంచింది. ప్రస్తుతం వివో అధికారిక స్టోర్‌లో 12GB + 256GB మోడల్ రూ.86,999గా, 12GB + 512GB మోడల్ రూ.96,999గా కనిపిస్తున్నాయి. అంటే కొత్త 8GB వేరియంట్, 12GB + 256GB మోడల్ కంటే సుమారు రూ.2,000 మాత్రమే తక్కువగా ఉంది.
Vivo X300 FEలో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, 6.31 అంగుళాల డిస్ప్లే, 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లు ఉన్నాయి. ధరల పెంపునకు మెమరీ, స్టోరేజ్ కాంపోనెంట్ల ఖర్చులు పెరగడం కారణంగా చెబుతున్నప్పటికీ, కొత్త 8GB వేరియంట్‌ను తీసుకురావడం ద్వారా ఈ సిరీస్‌లో కొంత తక్కువ ధర ఆప్షన్‌ను అందించాలని వివో ప్రయత్నించినట్లు తెలుస్తోంది.








