E-PAPER

బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. రాత్రి 8 గంటలకే దుకాణాలు మూసివేత!

బంగ్లాదేశ్‌ తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా గంటల తరబడి విద్యుత్ కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన ఆగస్టు 12 నుంచి అమల్లోకి వచ్చినట్లు బంగ్లాదేశ్‌ మీడియా నివేదించింది.

విద్యుత్‌ పొదుపు చర్యల్లో భాగంగా బిల్‌బోర్డులను సాయంత్రం 7 గంటలకే ఆపేయాలని, అలంకరణ లైట్ల వినియోగాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో తీవ్రమవుతున్న గ్యాస్ కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడం, దాంతో లోడ్‌షెడ్డింగ్ పెరగడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు.

ప్రజలు, వ్యాపార సంస్థలు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తోంది. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, దుకాణాల పని వేళలను తగ్గించడం ద్వారా రాత్రి సమయంలో విద్యుత్ డిమాండ్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితి బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఇంధన, విద్యుత్ సంక్షోభ తీవ్రతను మరోసారి స్పష్టం చేస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!