యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ భుజానికి ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమని సమాచారం. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
అయితే ఎన్టీఆర్ షూటింగ్‌కు దూరంగా ఉన్న సమయంలో సమయాన్ని వృథా చేయకుండా ప్రశాంత్ నీల్ మరో ప్లాన్ సిద్ధం చేసినట్లు టాక్. ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూనే, మరోవైపు ప్రభాస్‌తో ‘సలార్-2’ షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘సలార్-2’లో దాదాపు 20 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ పాత్రకు సంబంధించిన చిన్ననాటి సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌తో బిజీగా ఉండగా, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ‘స్పిరిట్’ పూర్తయిన తర్వాత నెలలో 15 రోజులు ‘సలార్-2’, మరో 15 రోజులు ‘కల్కి 2’ కోసం డేట్స్ కేటాయించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మరోవైపు ప్రభాస్ డేట్స్ అందుబాటులో లేకపోతే, ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ‘డ్రాగన్’ షూటింగ్‌ను వేగవంతం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్స్‌పై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రశాంత్ నీల్ ఈ రెండు భారీ ప్రాజెక్టులను ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.








