E-PAPER

బ్యాక్‌బెంచర్‌ నుంచి స్టార్ హీరోగా.. విశాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

తమిళ స్టార్ హీరో Vishal ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విద్యాభ్యాసం, కాలేజీ రోజులు, సినీ రంగంలోకి వచ్చిన విధానం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను చదువులో టాపర్‌ను కాదని, సగటు విద్యార్థినేనని తెలిపారు. తాను బ్యాక్‌బెంచర్‌గా ఉండేవాడినని, తన బ్యాచ్‌లోని మరో ఇద్దరు కూడా తర్వాత రాజకీయాల్లో కీలక స్థానాలకు వెళ్లారని సరదాగా చెప్పారు.

బ్యాక్‌బెంచ్‌లో కూర్చోవడానికి అసలు కారణాన్ని కూడా విశాల్‌ నవ్వుతూ వెల్లడించారు. తాను బాయ్స్ స్కూల్‌లో చదువుకున్నానని, ప్రశ్నలకు సమాధానాలు తెలియని సమయంలో టీచర్లకు కనిపించకుండా ఉండేందుకు బ్యాక్‌బెంచ్‌ అనుకూలంగా ఉండేదని చెప్పారు. 12వ తరగతి చివరి రోజు వరకు ప్రశ్నపత్రం కోసం ప్రయత్నించినా అది దొరకలేదని, చివరికి చదివి పరీక్ష రాసి 75 శాతం మార్కులు సాధించినట్లు గుర్తుచేసుకున్నారు.

చిన్నప్పటి నుంచి తనకు జీవితంలో ఎన్నో మార్గాలు కనిపించేవని విశాల్ తెలిపారు. తన తండ్రి తనను అథ్లెట్‌గా చూడాలనుకున్నప్పటికీ, ఓ సినిమా చూసిన తర్వాత దర్శకుడు కావాలనే ఆలోచన తనలో బలపడిందని చెప్పారు. తాను దర్శకుడిని కావాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారని గుర్తుచేసుకున్నారు. కాలేజీ రోజుల్లో ఎదురైన అనుభవాలు జీవితాన్ని తీర్చిదిద్దడంలో కీలకమని, వాటిని ఆస్వాదించాల్సిందేనని అన్నారు. తన తండ్రి నుంచి సానుకూలంగా ఆలోచించడం, ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటం నేర్చుకున్నానని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అదే దృక్పథంతో ముందుకు సాగాలని విశాల్‌ సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!