కమలాపురం, అక్టోబర్ 29 (Y7 న్యూస్ తెలుగు):
నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలి అంత్యక్రియలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. కమలాపురం గ్రామంలోని మాలవాడకు చెందిన జెట్టి సుమిత్ర (భర్త కుమారస్వామి, లేటు) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యులు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్‌ను సహాయం కోరారు. స్పందించిన ట్రస్ట్ ప్రతినిధులు ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా దాతలకు విజ్ఞప్తి చేశారు. దాతలు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించడంతో మొత్తం రూ.14,000 సమకూరాయి. ఈ మొత్తాన్ని ట్రస్ట్ సభ్యులు మృతురాలి కుటుంబానికి అందజేశారు.
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి దాతల సహకారంతో అండగా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోలి నరేష్, గంగుల చంటి, నిమ్మల నరేష్, మావిళ్ల నాగరాజు, కర్రి లక్ష్మయ్య, తోగరి సురేష్, తోగరి ఆనంద్, తోగరి అరుణ్, సాధనపల్లి సాంబయ్య, జెట్టి రవి, గద్దల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.








