E-PAPER

సీతారామ గోదావరి జలాలపై రేపు అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా స్థానిక రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్

అశ్వాపురం, జూలై 14 (వై7 న్యూస్): సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న గోదావరి జలాలను మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అశ్వాపురం మండల రైతాంగానికి అందించాలని కోరుతూ బుధవారం అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ తెలిపారు.

జూలై 15న ఉదయం 10 గంటలకు అశ్వాపురంలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. సీతారామ ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగం, స్థానిక రైతులకు సాగునీటి అందుబాటు వంటి అంశాలపై రాజకీయ పార్టీలు, రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు చర్చించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సీతారామ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అలాగే రూ.400 కోట్ల వ్యయంతో మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించి నిధులు మంజూరు చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం స్థానిక రైతాంగానికి నీళ్లు అందించకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అశ్వాపురం మండల రైతులకు సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిలపక్ష పార్టీలు, మిత్రపక్షాలు, రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక రైతులకు నీళ్లు ఇవ్వకుండా పక్క జిల్లాలకు తరలించే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సీతారామ పంప్ హౌస్ ముట్టడి, రాస్తారోకోలు తదితర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!