E-PAPER

పీఎస్ నెం.108 పరిధిలో ఈఎఫ్ ఫారాల సేకరణ

దుమ్ముగూడెం, జూన్ 30:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దుమ్ముగూడెం మండలంలోని పోలింగ్ కేంద్రం నెం.108 పరిధిలో ఈఎఫ్ ఫారాల సేకరణ చేపట్టారు. ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు, కొత్తగా అర్హులైన వారి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి మాలోత్ నరేష్ ఆధ్వర్యంలో ఓటర్లకు మార్గదర్శకాలు అందజేశారు. కార్యక్రమంలో కెళ్ల శేఖర్, లక్ష్మణరావు తదితరులు పాల్గొని ఓటర్లకు అవసరమైన సూచనలు చేశారు.
ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News