దుమ్ముగూడెం: ఫోటోగ్రఫీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, మహిళా ఫోటోగ్రాఫర్‌గా విశేష ప్రతిభ కనబరుస్తున్న లోహిత డిజిటల్స్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ పూదోట కృష్ణవేణిని ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా ఘనంగా సత్కరించారు.
టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ కనుబుద్ది దేవా ఆమెను శాలువాతో సత్కరించి ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కనుబుద్ది దేవా మాట్లాడుతూ.. మహిళలు ఏ రంగంలోనైనా తమ ప్రతిభను చాటగలరని నిరూపిస్తూ, ఫోటోగ్రఫీ రంగంలో అంకితభావంతో ముందుకు సాగుతున్న పూదోట కృష్ణవేణి సేవలు, ప్రతిభ అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంక అబ్బులు, బైరెడ్డి సీతారామరావు, లంక రాంప్రసాద్, వాసం రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 7








