ములుగు, ఆగస్టు 19 ( వై 7న్యూస్);
ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాత గ్రామ కమిటీలను రద్దు చేస్తున్నట్లు మంత్రి దనసరి అనసూయ సీతక్క, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో గోవిందరావుపేట మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాత గ్రామ కమిటీలన్నీ తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ నాయకులు ప్రకటించారు.నూతన గ్రామ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని కోరారు.అలాగే నూతన గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తయ్యే వరకు పార్టీ నిర్ణయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పార్టీ ఐక్యతను కాపాడుతూ ముందుకు సాగాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.నూతన కమిటీల ఏర్పాటు అనంతరం గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే దిశగా కాంగ్రెస్ నాయకత్వం చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.








