E-PAPER

మనసున్న మా”రాణి ” ‘ సంధ్యారాణి”

వై 7 న్యూస్ పలాస

విద్యార్థిని సమీరకు కంటిచూపు తెప్పించేందుకు శస్త్ర చికిత్స చేయించిన ఉపాధ్యాయిని

వివరాల్లో కి వెళితే పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో గల సూది కొండ ప్రాథమిక పాఠశాల లో ఐదవ తరగతి చదువుతున్న సమీరా అనే విద్యార్థి చిన్నప్పుడు నుండి కంటిచూపు సమస్యతో బాధపడుతూ పాఠశాలకు వస్తుండేది. ఆ విషయాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయిని తమ్మినాన సంధ్యారాణి విద్యార్థిని కంటిచూపు లో పడుతున్న ఇబ్బంది గమనించి ఈ విషయమై అమ్మాయి తల్లిదండ్రులను సంప్రదించి వివరాల్ని అడిగి తెలుసుకుంది .చిన్నతనం నుండి కంటిచూపు సమస్య ఉన్నప్పటికీ పేదరికం కారణంగా శస్త్రచికిత్స చేయలేని పరిస్థితి ఆ తల్లిదండ్రులున్నారు తండ్రి కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటూoడగా తల్లి దినసరి కార్మికురాలుగా ఉన్న కుటుంబానికి సాయం చేయాలని భావించిన ఈ ఉపాధ్యాయుని తన భర్త ఉపాధ్యాయుడు కె వి వి ఎస్ ప్రసాదరావు కు చెప్పింది. ఆయన పలువురు డాక్టర్లును సంప్రదించారు.చికిత్స ఖరీదైనప్పటికీ తక్కువ ఖర్చుతో చేసేందుకు డాక్టర్లును అంగీకరింప చేసి కొంత మొత్తాన్ని సైతం తాను కూడా చెల్లించి నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తన పాట శాల సిబ్బంది విద్యాశాఖ అధికారులు ను సంప్రదించారు. అనుమతి తీసుకుని తానే స్వయంగా సమీరా ను విశాఖ పట్నం హాస్పిటల్ తీసుకెళ్లి తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేరేందుకు అహర్నిశలు కృషి చేసింది. చివరకు సోమవారం విశాఖపట్నంలో గల విశాఖ ఐ హాస్పిటల్ నందు డాక్టర్ గోపాల రాజు ఆధ్వర్యంలో కంటివైద్య బృందంతో శస్త్ర చికిత్స విజయవంతమైంది .పట్టు వదలని ఆమె ప్రయత్నం ఆ చిన్నారి కంటి వెలుగును ప్రసాదించేలా చేసింది.. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి ఆర్థికంగా సాయపడటం సర్వసాధారణం కానీ చివరి దాకా వెన్నంటి నిలవడం గొప్ప విషయం కదా.. విలువలు చెప్పిన మనం ఆచరణలో కూడా చూపించడమే కదా అసలైన మానవత్వం

వార్త కావాలి

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News