శ్రీరాంపూర్:
ఎస్సీ కేఎస్–సిఐటియు ఆధ్వర్యంలో కన్వేయన్స్ డ్రైవర్లు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు సహా పలువురు సమస్యలు పరిష్కరించకపోవడంతో, నిరసన కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లు విధులకు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు బ్రాంచ్ సహాయ కార్యదర్శి కాసీపేట రాజేశం మాట్లాడుతూ…
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కన్వేయన్స్ డ్రైవర్ల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీవన ఖర్చులకు వేతనాలు తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమైపోతుందన్నారు.
అధికారులు, వెహికల్ ఓనర్లు సానుకూలంగా స్పందించి వేతనాల పెంపు, పనిబారాన్ని తగ్గించడం, ఇతర మౌలిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలను సమరస్యంగా పరిష్కరించకపోతే, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంపత్ రావు, కలవేని సతీష్, తోకల రాజుకుమార్, వినేయ్, సూర అనీల్, నవీన్, శ్రావణ్, వెంకటేష్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.









