వై 7 న్యూస్ పలాస
పలాస మండలం సున్నాడ గ్రామ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ప్రారంభ చికిత్స కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి దృష్ట్యా మెరుగైన వైద్యసేవల కోసం ఆయనను జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Post Views: 68









