పాల్వంచలో పార్కింగ్‌లో నిలిపిన బైకులపై దూసుకుపోయిన లారీ
పాల్వంచ పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. మద్యం మత్తులో అదుపుతప్పిన లారీ డ్రైవర్, రోడ్డుపక్కన క్రమంగా పార్క్ చేసిన బైకులపై వరుసగా దూసుకెళ్లడంతో అనేక బైకులు ధ్వంసం అయ్యాయి.ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Post Views: 103









