సూర్యాపేట: గరిడేపల్లి విభాగానికి చెందిన 33KV కల్మల్చెర్వు ఫీడర్‌లో అత్యవసర విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు శుక్రవారం (28-11-2025) తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయబడనుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు 11KV పరెడ్డిగూడెం ఫీడర్ పరిధిలోని అన్ని గ్రామాలు మరియు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ నిలిపివేయబడుతుంది. మరమ్మతు పనులు సురక్షితంగా, వేగంగా పూర్తిచేయడానికి వినియోగదారులు సహకరించాలని AE గరిడేపల్లి విజ్ఞప్తి చేశారు.
మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Post Views: 42









