E-PAPER

కలెక్టర్‌తో ఎన్నికల అబ్జర్వర్‌ల భేటీ

భద్రాద్రి కొత్తగూడెం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో జిల్లాకు సాధారణ పరిశీలకుడిగా సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకురాలిగా లావణ్య నియమితులయ్యారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ ఇద్దరు పరిశీలకులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారు వారికి పూల మొక్కను అందించి సన్మానించారు. అనంతరం రాబోయే ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లు, వ్యయ పర్యవేక్షణ, అమలు చేయవలసిన ఎన్నికల నియమావళి వంటి పలు కీలక అంశాలపై అధికారులు పరస్పరం చర్చించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News