భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ (అటానమస్) కళాశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవంను రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జాన్ మిల్టన్ హాజరై, సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
ఉక్కు మనిషి వల్లభభాయ్ పటేల్ లేకపోతే నేటి భారత్ ఉండేది కాదు. ఆయన ఉక్కు సంకల్పం వల్లే భారతదేశం ఐక్యంగా నిలిచింది,” అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న జాతీయ ఐక్యతా దినోత్సవం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని, స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ వంటి 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన పటేల్ గారి దార్శనికత, ధైర్యం నేటి యువతకు స్ఫూర్తి. విద్యార్థులు కూడా ఆయన స్పూర్తితో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి,” అని విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ మిల్టన్ సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ హవిలా, అకడమిక్ కోఆర్డినేటర్ హిమజ, చరిత్ర అధ్యాపకులు కిరణ్ కుమార్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్, రాజకీయ శాస్త్ర అధ్యాపకులు వాడే వీరస్వామి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పులిపాటి పాపారావు|జర్నలిస్ట్









