ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్
మణుగూరు, అక్టోబర్ 31 (వై7 న్యూస్ తెలుగు):
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మణుగూరు ఏరియా అక్టోబర్ నెలలో 73 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఈ రోజు (31.10.2025) జిఎం కార్యాలయంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాతో జరిగిన సమావేశంలో వెల్లడించారు.
జీఎం రామచందర్ మాట్లాడుతూ,
అక్టోబర్ నెలలో మణుగూరు ఏరియాకు నిర్ధారించిన 10,36,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 7,52,484 టన్నులు ఉత్పత్తి చేయగలిగాం. ఇది 73 శాతం సాధన.
ఏప్రిల్ 1, 2025 నుండి అక్టోబర్ 31, 2025 వరకు ప్రోగ్రెసివ్‌గా 62,11,000 టన్నుల లక్ష్యానికి 59,31,117 టన్నులు ఉత్పత్తి చేయడం ద్వారా 95 శాతం సాధించాం,” అని తెలిపారు.
రవాణా వివరాలు తెలుపుతూ ఆయన పేర్కొన్నారు..
“అక్టోబర్ నెలలో 6,74,084 టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగింది.
ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 31 వరకు ప్రోగ్రెసివ్‌గా 58,39,525 టన్నులు రవాణా చేశాం.”
అదే విధంగా, ఓవర్ బర్డెన్ విభాగంలో కూడా మణుగూరు ఏరియా శ్రద్ధగా పనిచేసిందని చెప్పారు.
“డిపార్ట్‌మెంటల్ లక్ష్యం 15 లక్షల క్యూబిక్ మీటర్లు కాగా, అందులో 9,54,000 క్యూబిక్ మీటర్లు (64%) తవ్వకం జరగింది,” అని వివరించారు.
ఉద్యోగుల సంక్షేమంలో ముఖ్యమైన చెల్లింపులు
అక్టోబర్ 2025లో పదవీ విరమణ, మెడికల్ ఇన్వాలిడేషన్ లేదా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఈ క్రింది చెల్లింపులు చేసినట్లు జీఎం తెలిపారు:
CMPF – 09
Pension – 09
Gratuity – 11
FBIS (Death) – 02
FBIS (Accumulations) – 24
HBLIRS – 10
CPRMS Card – 08
ఇతర సంక్షేమ చర్యలు
CE కోసం Dependents sent to Initial Medical Examination – 12
Overall Seniority Report కోసం CE dependents – 8
Medical Camps:
Vital Rao Nagar – 155 మంది
Satya Sai Special School & Sri Vidyabhyasa Charitable Trust – 86 మంది
Cadre Scheme Promotions: EP Operator D to C Promotions – 93
మణుగూరు ఏరియాలో సింగరేణి బృందం నిరంతర కృషి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఉన్న నిబద్ధతకు జీఎం దుర్గం రామచందర్ అభినందనలు తెలిపారు.
# పులిపాటి పాపారావు | జర్నలిస్ట్









