పలాస, జూలై 20 (వై7 న్యూస్):
ఆదివారం ఉదయం పలాస మండలంలోని కోసంగిపురం సమీప జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోళ్లను తీసుకెళ్తున్న వ్యాన్‌ను వేగంగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మరణించాడు.
వాన్లో ఉన్న వందలాది కోళ్లు కూడా ఘటనలో చనిపోయాయి. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు, నేషనల్ హైవే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరన్న సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక చనిపోయిన కోళ్లను సమీప ప్రదేశంలో ఖననం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 28