జోగులాంబ గద్వాల,
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఎన్ టి యు సి జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ , రాష్ట్ర శ్రమశక్తి అవార్డు గ్రహీత ఆర్ పి జయప్రకాష్ ను రాజోలి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి మధుబాబు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. తదనంతరం జయప్రకాష్ ను శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు మాట్లాడుతూ జయప్రకాష్ రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి సూపర్ వైజర్ గా పనిచేసి జిల్లా లోనే ప్రథమ స్థానంలో కి తెచ్చారని ఆయన అన్నారు. మండల పరిధిలో ప్రతి గ్రామంలో టిబి ప్రోగ్రామ్ లను నిర్వహించి ప్రజలకు క్షయ వ్యాధి పై అవగాహన కల్పించారు అని ఆయన చెప్పారు. తనకు కేటాయించిన టార్గెట్ కు పైగా టిబి కేస్ లను చేయించి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నుండి ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు తీసుకుని రాజోలి పి హెచ్ సీ కు మంచి పేరు తెచ్చారని ఆయన వెల్లడించారు. జయప్రకాష్ లాగే అందరూ కస్టపడి పనిచేసి రాజోలి పి హెచ్ సీ కి మంచి పేరు తేవాలని, మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలని రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి మధుబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ హెలెన్, రామక్రిష్ణ, రంజిత్ కుమార్, చంద్రమోహన్,ఎమ్ ఎల్ హెచ్ పి వెంకటేశ్వరమ్మ, నర్సింగ్ ఆఫీసర్ శ్రీలత, మంజుల, ఏ ఎన్ ఎమ్ లు సుజాత, శిరీష, నిర్మల, మద్దమ్మ, కిస్టమ్మ, సువర్ణ, ఆశా కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు