మణుగూరు, జూలై 8: వై 7 న్యూస్;
మణుగూరు మండలంలోని లంక మల్లారం గర్ల్స్ గురుకుల హాస్టల్‌ను మంగళవారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పోడుతురు కళ్యాణ్ బాబు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో హాస్టల్‌లో వసతి తీసుకుంటున్న విద్యార్థులతో మాట్లాడారు.విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు భోజనం మెనూ ప్రకారం సరైన ఆహారం అందుతున్నదా, ఆహార నాణ్యత ఎలా ఉందని పరిశీలించారు. విద్యార్థులు కొన్ని సమస్యలను వెల్లడించగా, వాటిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతలు కోరారు.
ఈ సందర్శనలో ఎమ్మార్పీఎస్ మణుగూరు మండల ఇంచార్జ్ ఉషికల కొండయ్య మాదిగ, మండల కార్యదర్శి పోడుతురు రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 38