E-PAPER

మరణించిన పంచాయతీ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం

జిల్లా కాంగ్రెస్ నేత కోరం సురేందర్ చేతుల మీదుగా సాయం పంపిణీ

టేకులపల్లి, జులై 10 వై 7 న్యూస్;

ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్‌ గ్రామ పంచాయతీలో రెండేళ్ల క్రితం చోటుచేసుకున్న విషాద సంఘటనలో చుక్కలబోడు గ్రామానికి చెందిన భూక్యా వెంకటేష్ అనే పంచాయతీ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం, తప్పుడు సమాచారాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వెంకటేష్ మరణానికి గత పాలకుల వైఖరే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయం స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య దృష్టికి వెళ్లిన తరువాత, ఆయన విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే కృషి చేశారు. ఈ పరిణామాల్లో భాగంగా, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ చేతులమీదుగా వెంకటేష్ భార్యకు రూ.5 లక్షల రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డివిజన్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్లతో పాటు, స్థానిక మండల నాయకులు భూక్యా సర్దార్ నాయక్, రాము, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :