అశ్వాపురం, జూలై 09 (వై 7 న్యూస్):
అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన రాణి అనే మహిళకు విద్యుత్ గుత్తేదారు డబ్బులు తీసుకుని సంవత్సర కాలంగా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న విషయం ఇటీవల వై 7 న్యూస్‌లో ప్రత్యేక కథనంగా ప్రచురితమైంది.
వార్త ప్రసారం అయిన కొద్ది గంటల్లోనే, సంబంధిత గుత్తేదారు స్పందిస్తూ బాధితురాలిని స్వయంగా కలుసుకుని ఆమెకు సంబంధించిన మొత్తం డబ్బును తిరిగి చెల్లించాడు. మీడియా ప్రభావంతో జరిగిన ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
బాధితురాలు రాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఏడాది నుంచి నన్ను వేధించిన అతడు, నేను వై 7 న్యూస్‌ను ఆశ్రయించగానే వెంటనే స్పందించి డబ్బులు ఇచ్చాడు. మీ మీడియా కారణంగా నాకు న్యాయం జరిగింది. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.
అలాగే, “ఇంకా ఇలాంటివే ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు ఎవరైనా ఉంటే, వారు కూడా వై 7 న్యూస్‌ను ఆశ్రయించండి. న్యాయం తప్పక జరుగుతుంది” అని పిలుపునిచ్చారు.
ప్రజల సమస్యలను వెలికి తీసి, వారి తరఫున నిలబడి పరిష్కార మార్గాలను చూపించడంలో వై 7 న్యూస్ మరోసారి తన సామాజిక బాధ్యతను నిర్వర్తించింది.