E-PAPER

గార్ల పెద్ద చెరువు చెరువు శికాన్ని దురాక్రమణ చేసిన కబ్జాదారులపై చర్య తీసుకోవాలి.

సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ డిమాండ్

గార్ల, జూన్ 07 వై 7 న్యూస్ తెలుగు;

గార్ల చెరువును సమగ్ర విచారణ చేసి దోసుకున్న వారిని శిక్షించాలని రైతులకు న్యాయం చేయాలని సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గార్ల న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో నేడు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సూత్రపు మనోహర్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జడ సత్యనారాయణ మాట్లాడుతూ, గార్ల చెరువు కింద 600వందల ఎకరాల భూమి రైతులు సేద్యం చేసుకుంటున్నారని 766 సర్వే నెంబర్లు 396ఎకరాల 29. మాత్రమే ఉంది ఇందులో 2003 ఎకరాల 29 గుంటలు కబ్జాదారులు దురాక్రమణ చేశారు . ప్రస్తుత దీని వలన పంటలు సరిగ్గా పండని పరిస్థితి లేదని,వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నీరు లేక పంటలు ఎండిపోయి నష్టపోతున్నారని అన్నారు. కబ్జాకోరులు చెరువులోతట్టులో బావులు తీసి బోర్లు వేసి కరెంటు స్తంభాలేసి అక్రమ పద్ధతిలో నీటిని వాడుకుంటున్నారని ఆ బావుల నుండి దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పైప్ లైన్ వేసుకొని పదుల ఎకరాలు మెట్ట పైర్లు వేసుకుంటున్నారని దీనివల్ల చెరువులో నీరు లేకుండా పోతుందని జడ సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉన్నత అధికారులకు స్థానిక అధికారులకు దశాబ్దాలుగా భూ ఆక్రమణ గురించి విజ్ఞప్తి చేసిన భూమి చెరువులో కలపలేదని కబ్జాదారులు ప్రజలను రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఒక్కసారి చెరువు నిండితే పంటలు పండే గార్ల చెరువు రెండుసార్లు అలు గుపడిన పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాం. చెరువు లోతట్టు ఎంత. ప్రస్తుతం ఎంత ఉన్నది. ఎంత దురాక్కమన చేసుకున్నారు. దురాక్రమణ చేస్తున్న భూమిని చెరువులో కలపాలని ఇప్పటికే తప్పుడు పత్రాలు సృష్టించి భూ కబ్జాదారులు పట్టాలు చేయించుకున్నారని పంటలు పండే పరిస్థితి లేదని అన్నారు. దురాక్రమనకు గురైన శిఖం భూమి హద్దులు నిర్ణయించి పెన్షన్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో సమరశీల పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎమ్ ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జీ సక్రు మాన్య యాకయ్య సైదులు వెంకన్న వీరన్న సురేష్ అసలే పద్మ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!