పిట్లం మండలం చిన్న కొడప్ గల్ లో ఘటన
రెడ్డి చెరువులో మృతదేహం లభ్యం
బాన్సువాడ జూన్ 7 వై సెవెన్ న్యూస్
పిట్లం మండలం చిన్నకొడపగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గా కృష్ణ(35) గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కృష్ణ అదృశ్యమయ్యాడు. శనివారం ఉదయం చిన్నకొడఫ్గల్ రెడ్డి చెరువులో కృష్ణ మృతదేహం లభ్యమైంది. కృష్ణ తలపై గాయాలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఘటన స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ సంబంధిత అధికారులు పరిశీలించారు. పిట్లం మండలం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, మృతుడి కృష్ణ ది పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని జగదాంబ తండా వాసి అని తెలిసింది.
Post Views: 51









