E-PAPER

మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పిద్దాం

టేకులపల్లి, జూన్ 7 (వై 7 న్యూస్):

టేకులపల్లి మండలంలోని వాగొడ్డు తండలోని ప్రాథమిక పాఠశాలలో “ఆచార్య జయశంకర్ బడిబాట” కార్యక్రమం రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, రుచికరమైన మధ్యాహ్న భోజనం, ఆరోగ్య పరీక్షలు, స్కాలర్షిప్‌లు, సుశిక్షితులైన ఉపాధ్యాయుల బోధన వంటి అనేక సదుపాయాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు భూక్య వీరన్న, జిల్లా ఉపాధ్యాయ సంఘం నేత బానోత్ లక్ష్మా తల్లిదండ్రులను ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News