మామడ, ఫిబ్రవరి 26 వై 7 న్యూస్;
నిర్మల్ జిల్లా మామడ మండలం రచ్చకోట ఆశ్రమంలో పంద్రం జాలీష్ రావు మహారాజ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఆదివాసి తొమ్మిది తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ అడెల్లి పోచమ్మను,శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లను దర్శించుకొని పూజలు చేశారు. వారు మాట్లాడుతూ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా, పరమ శివుడు మీకు ఆనందం, శాంతి , సామరస్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇర్ప వేంకటేశ్వర్లు,చుంచు సంతోష్ పాల్గొన్నారు.
Post Views: 310